వర్షంలోనూ తగ్గేదేలే.. గణేష్ శోభాయాత్ర!
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. భారీ వర్షం కురుస్తున్నా యువకులు, చిన్నారులు వెనక్కి తగ్గకుండా శోభాయాత్రలో పాల్గొంటున్నారు. డప్పు వాయిద్యాల నడుమ యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పట్టణంలో పండుగ సందడి నెలకొంది.