హోంగార్డ్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేసిన ఎస్పీ
భూపాలపల్లి జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డ్ శ్రీనివాస్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలిచింది. పోలీస్ శాఖ తరఫున రూ.20 వేల వెల్ఫేర్ ఎక్స్‌గ్రేషియా చెక్కును జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎస్పీ, శ్రీనివాస్ మృతికి సంతాపం తెలిపారు. కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.