నిమజ్జనాన్ని ప్రారంభించిన జిల్లా ఉన్నతాధికారులు
వరంగల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని జిల్లా ఉన్నతాధికారులు ప్రారంభించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని 17 చెరువుల్లో 30 క్రేన్లతో రూ.2 కోట్లతో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద కలెక్టర్ సత్యశారద, కమిషనర్ వెంకన్న, కుడా చైర్పర్సన్ సుధారాణితో కలిసి నిమజ్జనాన్ని ప్రారంభించారు. 145 మంది గజ ఈతగాళ్లు, డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో నిమజ్జనాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.