రంగరాయగూడెంలో 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం
జనగాం: స్టేషన్ ఘనపూర్ మండలం రంగరాయగూడెం గ్రామంలో PM కుసుమ్ పథకం కింద రైతు నెలమంచ అజయ్ రెడ్డి ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. బంజరు భూములు లేదా తక్కువ సాగు విస్తీర్ణం ఉన్న ప్రాంతాల్లో సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులు విద్యుత్‌ను విక్రయించి ప్రత్యామ్నాయ ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు.