‘సూపర్‌ ఎల్‌నినో’తో 4.51 లక్షల మరణాల అంచనా!

న్యూఢిల్లీ: ఈ ఏడాది తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న ‘సూపర్‌ ఎల్‌నినో’ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆరు నెలల్లో సుమారు 4,51,000 అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోకు చెందిన క్లైమేట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా గ్లోబల్‌ సౌత్‌ దేశాలపై ప్రభావం అధికంగా ఉండొచ్చని పేర్కొంది. భారత్‌లో సెప్టెంబర్‌ 2026 నుంచి ఫిబ్రవరి 2027 వరకు సుమారు 15,800 అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో దాదాపు 7,400 మరణాలు డిసెంబర్‌–ఫిబ్రవరి మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆఫ్రికాలోని సాహెల్‌ ప్రాంతంలో 66,800 మరణాలు సంభవించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.