ఏ-320 విమానాలకు అనుగుణంగా రన్‌వే.. ఆధునిక సౌకర్యాలతో టెర్మినల్...Mamnoor Update
వరంగల్: మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి సంబంధించి టెండర్ వివరాల్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. మామునూరు ఎయిర్‌పోర్టును డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేయనున్నట్లు టెండర్‌లో పేర్కొన్నారు. ఏ-320 (కోడ్-సీ) తరహా విమానాలు ల్యాండ్, టేకాఫ్ అయ్యేలా రన్‌వేను నిర్మించనున్నారు. ఇందుకోసం 2,500 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్‌వే ఏర్పాటు చేయనున్నట్లు టెండర్ వివరాల్లో ఉంది. విమానాశ్రయంలో ప్రయాణికులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలతో టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో 12 చెక్‌ఇన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి సుమారు 850 మంది ప్రయాణికులు కూర్చునేలా సీటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. ప్రయాణికుల భద్రత కోసం రెండు సెక్యూరిటీ చెక్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా వీఐపీ, సీఐపీ...