వచ్చే ఏడాది మళ్లీ రావయ్యా..
వర్ధన్నపేట: తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథులకు బుధవారం భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో మండపాల వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు, హారతులు నిర్వహించిన అనంతరం గణేశ్ విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. యువత డీజేలు, డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ సందడి చేయగా.. మహిళలు, చిన్నారులు భక్తిగీతాలు ఆలపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. వీధుల్లో పండుగ వాతావరణం గణనాథుల ఊరేగింపుతో పట్టణంలోని ప్రధాన వీధులు సందడిగా మారాయి. భక్తులు ‘గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ రా’ అంటూ నినాదాలు చేస్తూ గణేశుడికి వీడ్కోలు పలికారు. పలుచోట్ల భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గణపతిని నిమజ్జనానికి...