గణేశుని నిమజ్జనం సమయంలో.. జాగ్రత్త వహించండి
హైదరాబాద్: గణేశుని నిమజ్జనం సందర్భంగా విగ్రహంతో పాటు పూజా సామగ్రిని కూడా జలాశయాల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా మారింది. అయితే పూజా సామగ్రి విసర్జన, గణేశునికి వీడ్కోలు పలకడం వేర్వేరు ప్రక్రియలని గుర్తించాలి. నిమజ్జనానికి ముందు ఉత్తర పూజ నిర్వహించి, పూలు, దూర్వా గడ్డి, నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. అనంతరం విగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్థానం నుంచి కొద్దిగా ముందుకు జరపాలి. విగ్రహానికి సమర్పించిన పూలు, పూలమాలలు, దూర్వా గడ్డి, ఆకులను నిమజ్జనానికి ముందే విడిగా తీసుకోవాలి. వీటిని నదులు, చెరువులు, కాలువల్లో వేయకూడదు. సహజ పూలు, ఆకులతో సేంద్రియ ఎరువు తయారు చేయవచ్చు లేదా శుభ్రమైన మట్టిలో పాతిపెట్టవచ్చు. ప్లాస్టిక్ మాలలు, రిబ్బన్లు, థర్మాకోల్,...