వర్ధన్నపేటలో భారీ వర్షం.. నిమజ్జనానికి ఆటంకం
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో బుధవారం భారీ వర్షం కురుస్తోంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఒక్కసారిగా వర్షం పడటంతో ఉత్సవ నిర్వాహకులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నిర్వాహకులకు వర్షం నిరాశ మిగిల్చింది. అయినప్పటికీ పలుచోట్ల వర్షంలోనే గణనాథులను ఊరేగిస్తూ భక్తులు నిమజ్జన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.