ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిమజ్జనం నిర్వహించుకోవాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: భారీ వర్షాల నేపథ్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. నిర్వాహకులు, భక్తులు సమన్వయంతో వ్యవహరించి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. ప్రమాదకర ప్రాంతాలు, లోతైన నీటి ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, నిమజ్జన వేడుకలు సురక్షితంగా ముగియాలని ఆకాంక్షించారు.