దాస్యం వినయ్‌భాస్కర్‌తో పాటు 15 మంది బీఆర్‌ఎస్‌ నేతలపై కేసు

వరంగల్‌: మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో పాటు మరో 15 మంది బీఆర్‌ఎస్‌ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించి ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు మట్టేవాడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. బీఎన్‌ఎన్‌ఎస్‌ 132, 121, 189, 190, 126, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.