చిన్న వడ్డేపల్లి చెరువులో ఘనంగా గణేష్‌ నిమజ్జనం

వరంగల్‌: నగరంలోని చిన్న వడ్డేపల్లి చెరువులో గణేష్‌ నిమజ్జనోత్సవం ఘనంగా కొనసాగింది. నిమజ్జన కార్యక్రమంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ డా. సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టారు. భారీగా తరలివచ్చిన భక్తులతో చెరువు పరిసరాలు సందడిగా మారాయి.