మావోయిస్టుల డంప్‌ స్వాధీనం

బీజాపూర్‌, ఛత్తీస్ ఘడ్: బేద్రే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లంకా పహాడి గ్రామ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు, మైన్ల తొలగింపు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో అడవిలో భూగర్భంలో దాచినట్లు గుర్తించిన మావోయిస్టుల డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డంప్‌లో SLRలు, INSAS తుపాకులు, .315 బోర్‌ గన్‌లు, BGL లాంచర్లు, BGL సెల్‌లు, చైనా తయారీ హ్యాండ్‌ గ్రెనేడ్లు తదితర భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించినట్లు అధికారులు తెలిపారు. అడవిలో మరింత గాలింపు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.