🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 04 November 2026, 7:20 pm Posted by : Telangana Gontuka

యాదవుల ఆత్మగౌరవానికి ఎక్కడా లోటు రానివ్వం: సీఎం రేవంత్‌రెడ్డి

News Image
TG : సదర్ సమ్మేళనం యాదవులకే పరిమితమైన కార్యక్రమం కాదని, తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవ సమ్మేళనమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యాదవుల సహకారంతోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించలేదని, తమ ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించి రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. తెలంగాణలో కులగణన నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలిచామని తెలిపారు. యాదవులకు తగిన రాజకీయ, సామాజిక ప్రాధాన్యం కల్పించామని, అనిల్‌కుమార్ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్‌కు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చామని వివరించారు. యాదగిరిగుట్ట బోర్డులో ఈశ్వరమ్మ యాదవ్‌కు స్థానం కల్పించామని, గోశాలల్లో ఆవుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యాదవుల ఆత్మగౌరవానికి ఎక్కడా లోటు రాకుండా చూడటం తమ బాధ్యతని, ముసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు.
🏠 Home