🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 04 November 2026, 7:14 pm Posted by : Telangana Gontuka

ఉచిత ఆటో ప్రయాణం పేరుతో నగల దోపిడీ.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

News Image
TG : వృద్ధులు, ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని ఉచిత ఆటో ప్రయాణం పేరుతో బంగారు నగలు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మందిని పట్టుకుని, వారి నుంచి 10 తులాల బంగారం, ఆటో, కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో వాంతులు చేస్తున్నట్లు నటించి బాధితుల దృష్టి మరల్చి నగలు దొంగిలించడం వీరి పద్ధతి. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 20కి పైగా నేరాలకు పాల్పడినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
🏠 Home