🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 November 2026, 10:50 am Posted by : Telangana Gontuka

‘మైసా’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ విడుదల.. పవర్‌ఫుల్‌ అవతారంలో రష్మిక

News Image
TG : రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మైసా’ నుంచి ‘ఓ మైసా రే’ తొలి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. గిరిజన గోండు మహిళగా రష్మిక పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనుంది. మహిళా శక్తి, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ పాటకు జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందించగా, సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం రాశారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సముద్రఖని, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్‌ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
🏠 Home