🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 7:37 pm Posted by : Telangana Gontuka

హైదరాబాద్‌లో 36 గంటలు తాగునీటి సరఫరాకు అంతరాయం

News Image
హైదరాబాద్‌: గండిపేట నుంచి నగరానికి నీటిని తరలించే పురాతన రాతి కాండ్యూట్‌ లీకేజీల మరమ్మతుల కారణంగా నవంబర్‌ 3 ఉదయం 6 నుంచి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోనుంది. రెడ్‌హిల్స్‌, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్‌, అసెంబ్లీ, సెక్రటేరియట్‌, ఆసిఫ్‌నగర్‌, విజయనగర్‌ కాలనీ, దోమలగూడ, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాలపై ప్రభావం ఉంటుంది. ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని జలమండలి సూచించింది.
🏠 Home