🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 7:14 pm Posted by : Telangana Gontuka

ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం.. డీసీసీ నియామకాలపై వివాదం

News Image
ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జుక్కల్‌ మధ్య డీసీసీ నియామకాల విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మంత్రి అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని ఎమ్మెల్యే పీసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇరువురు నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడంతో పాటు ఘర్షణకు దగ్గరయ్యారని ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నట్లు పేర్కొన్న వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే సిద్ధమవుతున్నట్లు సమాచారం.
🏠 Home