🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 7:11 pm Posted by : Telangana Gontuka

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగించాలి: కవిత

News Image
TG : తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డిని కలిసి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువును నామినేషన్ల వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 6తో గడువు ముగుస్తుండగా, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ 21వ తేదీ వరకు ఉన్నందున రిజిస్ట్రేషన్‌ కొనసాగించాలని కోరినట్లు తెలిపారు. యువత, గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ కార్యకలాపాలపై నివేదిక ఇచ్చి, ఢిల్లీలో పార్టీ రిజిస్ట్రేషన్‌కు సహకరించాలని కూడా కోరినట్లు వెల్లడించారు.
🏠 Home