🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 6:51 pm Posted by : Telangana Gontuka

డేటింగ్‌ యాప్‌ పరిచయంతో రూ.18 లక్షలు మోసం

News Image
జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గే డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన వ్యక్తి ఓ యువకుడిని నమ్మించి సుమారు రూ.18 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పరిహారం డబ్బులతో పాటు అప్పులు చేసి బాధితుడు చెల్లించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరికొందరు యువకులూ బాధితులై ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home