బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌తో గుర్తింపు పొందిన నటి అశ్విని శ్రీ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాబోయేవాడు అందంగా లేకపోయినా, డబ్బు లేకపోయినా పర్వాలేదని, మంచి మనసు ఉండి తనను బాగా చూసుకుంటే చాలన్నారు. ప్రస్తుతం తనకు బాయ్‌ఫ్రెండ్ ఎవరూ లేరని, తనను ఇష్టపడేవారు చాలామంది ఉన్నా మనసుకు నచ్చిన వ్యక్తి కావాలని పేర్కొన్నారు. అవసరమైతే భర్తను తానే పోషిస్తానన్న ఆమె పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.