🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 12:19 pm Posted by : Telangana Gontuka

వ్యవసాయ బావి వద్ద పీఏసీఎస్ డైరెక్టర్ ఆత్మహత్య

News Image
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్ వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకుని మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్యతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. లక్ష్మణ్ గౌడ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
🏠 Home