🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 12:08 pm Posted by : Telangana Gontuka

మద్యం మత్తులో కన్న కొడుకునే కడతేర్చిన తండ్రి.. ఐదేళ్ల బాలుడి హత్య

News Image
హైదరాబాద్‌ బోరబండ శిల్పినగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో విద్యాసాగర్‌ (36) తన ఐదేళ్ల కుమారుడు విజయ్‌ గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం. క్యాటరింగ్‌ పనికి వెళ్లిన తల్లి దుర్గ తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూడగా బాలుడు మృతిచెంది ఉన్నాడు. పొరుగువారికి సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం అందగానే నిందితుడు పరారయ్యాడు. బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home