🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 12:04 pm Posted by : Telangana Gontuka

కడప–రేణిగుంట హైవే పనులు వేగవంతం.. 2027 చివరికి పూర్తి

News Image
ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్‌ అందించింది. 122 కి.మీ. మేర నాలుగు లైన్ల కడప–రేణిగుంట గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు వేగం పుంజుకున్నాయి. రూ.2,254 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులు 2025 అక్టోబర్‌లో ప్రారంభమయ్యాయి. భూసేకరణ, అటవీ అనుమతులు పూర్తికావడంతో నిర్మాణం కొనసాగుతోంది. హైవే అందుబాటులోకి వస్తే కడప నుంచి రేణిగుంట ప్రయాణ సమయం తగ్గి, తిరుమల భక్తులకు సౌకర్యం కలగనుంది. 2027 చివరికి పనులు పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.
🏠 Home