AP : రాప్తాడు కేసులో నిందితుడైన హేమంత్ సీఐపై కత్తితో దాడికి యత్నించడంతో ఆత్మరక్షణలో భాగంగా ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. పాఠశాల ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తొలగించి, మానసిక ధైర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.