🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 11:08 am Posted by : Telangana Gontuka

కాలం మారింది.. పలకరింపూ మారింది! బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాసులో అమితాబ్‌

News Image
ముంబైలోని జూహూలో తన నివాసం నుంచి బయటకు వచ్చిన బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఈసారి బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాసు వెనుక నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ప్రతి ఆదివారం అభిమానులను పలకరించే ఆయన, తొమ్మిది రోజుల క్రితం ఇంటిపై దాడి చేస్తామంటూ బెదిరింపు మెయిల్‌ రావడంతో భద్రతను పెంచుకున్నట్లు తెలుస్తోంది. అభిమానులకు అభివాదం చేసే సంప్రదాయం కొనసాగించినా, భద్రతా కారణాలతో ఈసారి ప్రత్యేక రక్షణ ఏర్పాట్ల మధ్య కనిపించారు.
🏠 Home