🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 10:48 am Posted by : Telangana Gontuka

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు పట్టివేత*

News Image
HYD : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి రూ.60 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. జైపూర్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా ముంబైకి నకిలీ నోట్లు తరలిస్తున్న రాజస్థాన్‌కు చెందిన శివరతన్‌ మహియా (19)ను ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలో అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి నకిలీ నోట్ల బ్యాగుతో పాటు ఐఫోన్‌, ప్రయాణ టికెట్‌ స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్రయాణానికి రూ.20 వేల కమీషన్‌ ఆశతో నోట్లు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ప్రధాన నిందితుడు ఓం ప్రకాశ్‌ పరారీలో ఉండటంతో అతడి కోసం గాలిస్తున్నారు.
🏠 Home