🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 10:10 am Posted by : Telangana Gontuka

మురసు తుఫాన్‌ ప్రభావం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష హెచ్చరికలు

News Image
AP : బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్ర తుఫాన్‌గా బలపడటంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌లు ప్రకటించింది. తీరం దాటే సమయంలో గంటకు 100–120 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశారు.
🏠 Home