🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 3:18 pm Posted by : Telangana Gontuka

సీజ్‌ చేసిన నగదు, బంగారం కాజేసినట్లు ఆరోపణలు.. కానిస్టేబుల్‌ అరెస్ట్‌

News Image
TG : హైదరాబాద్‌ మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శ్రవణ్‌ కేసులో స్వాధీనం చేసుకున్న సొత్తును కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ మొబైల్‌ ఫోన్‌లో ఉన్న రూ.1.70 లక్షలను బంధువుల ఖాతాలకు బదిలీ చేయడంతో పాటు, 12 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో శ్రవణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
🏠 Home