దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటుడు ఎంజీఆర్ జీవిత కథ ఆధారంగా ‘పురచీ తలైవర్ ఎంజీఆర్’ పేరుతో బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో జయలలిత పాత్ర కోసం త్రిషను సంప్రదిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎంజీఆర్ పాత్రలో జె.ఎం. బషీర్ నటించనున్నట్లు తెలుస్తోంది. చెన్నై రామపురంలో త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే త్రిష ఎంపికపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయలేదు.