TG : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారంలో విషాదం చోటుచేసుకుంది. కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు కాలేజ్ ఫెస్ట్ అనంతరం పొలాల్లో మద్యం సేవిస్తుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో భయపడి పరుగులు తీశారు. ఈ క్రమంలో అడవి పందుల నివారణకు పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.