భూటాన్‌లోని సింటాఫు సరస్సు నుంచి 74 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని ఒక్కసారిగా విడుదల చేయడంతో మో చు, సంకోష్ నదులకు వరద ముప్పు పొంచి ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్, కూచ్‌బిహార్, అస్సాంలోని ధుబ్రీ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. అలీపుర్‌దువార్‌లో 10 వేలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూటాన్‌లోనూ ముందస్తు చర్యలు చేపట్టారు.