AP : జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.66 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల చలామణికి పాల్పడుతున్న ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ నోట్లతో పాటు డమ్మీ తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.