🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 29 October 2026, 12:34 pm Posted by : Telangana Gontuka

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నవంబర్‌ 1, 2 తేదీల్లో వర్ష సూచన

News Image
AP : దక్షిణ అండమాన్‌ సముద్రం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. ఇది రానున్న 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో నవంబర్‌ 1, 2 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ వ్యవస్థ తుఫాన్‌గా మారుతుందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని, ప్రజలు అధికారిక హెచ్చరికలను గమనించాలని సూచించింది.
🏠 Home