🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 October 2026, 7:32 pm Posted by : Telangana Gontuka

అర్నాబ్‌ తుపాను బలహీనం.. మూడు జిల్లాలకు భారీ వర్ష సూచన

News Image
AP : అర్నాబ్‌ తుపాను నరసాపురం సమీపంలో తీరం దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. బుధవారం మధ్యాహ్నానికి బలహీనపడిన తుపాను రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. గురువారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి. ఆకస్మిక వరదల ప్రమాదం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగిపొర్లే వాగులు దాటవద్దని అధికారులు హెచ్చరించారు. సహాయక చర్యల కోసం 16 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు.
🏠 Home