అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో నవంబర్ 1 నుంచి పూజలు, హారతులు, దర్శన సమయాలు మారనున్నట్లు సమాచారం. ఉదయం 4 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోగా, 7 గంటల నుంచి సాధారణ దర్శనాలు ప్రారంభమవుతాయి. నైవేద్యం, స్వామివారి విశ్రాంతి వేళల్లో దర్శనానికి విరామం ఉంటుంది. రాత్రి 9.30 గంటలకు శయన హారతి, 10 గంటలకు ఆలయ ద్వారాల మూసివేత ఉంటుంది. భక్తులు వెళ్లే ముందు అధికారిక షెడ్యూల్ పరిశీలించాలి.