TG : తెలంగాణలో పరిపాలనా మార్పుల్లో భాగంగా ప్రభుత్వం 12 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ అక్టోబర్ 28న ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేయనున్న ఎం. దాన కిశోర్‌ను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పునర్నియమించింది. నవీన్ మిట్టల్‌కు పంచాయతీరాజ్, జయేష్ రంజన్‌కు అటవీ, వికాస్ రాజ్‌కు ఇంధన శాఖ బాధ్యతలు అప్పగించింది. పలు శాఖల్లో ఇతర అధికారులకూ కొత్త బాధ్యతలు కేటాయించింది.