తెలంగాణలో కరువుపై అఖిలపక్ష సమావేశం ప్రారంభం
తెలంగాణలో కరువు పరిస్థితులపై సచివాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, పంట నష్టం, తాగునీటి సరఫరా, భూగర్భ జలాల పరిస్థితులపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించగా, వీటిలో 111 మండలాల్లో తీవ్ర కరువు నెలకొన్నట్లు ప్రకటించింది.