2027 డిజిటల్ జనాభా లెక్కల్లో ఓబీసీ కులాల నమోదుకు ప్రత్యేక డ్రాప్‌డౌన్ మెనూ ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. జనాభా లెక్కల విధానం, డిజిటల్ ఫార్మాట్ నిర్ణయించడం సంబంధిత అధికారుల పరిధిలోని అంశమని పేర్కొంటూ, ఈ విషయంపై సెన్సస్ అధికారులకు వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది.