JNG : జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి ఐ గ్రామానికి పూర్వ వైభవం తీసుకురావాలని బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు వాణిజ్య కేంద్రంగా ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం సరైన రోడ్లు కూడా లేవని విమర్శించారు. చెరువు అభివృద్ధి పనులు నాసిరకంగా జరగడంతో నీరు నిల్వ ఉండటం లేదని ఆరోపించారు. చెరువు మత్తడిని పటిష్ఠం చేసి, కాలువల ద్వారా నీరు నింపాలని, రోడ్లు పునర్నిర్మించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.