🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 18 October 2026, 4:15 pm Posted by : Telangana Gontuka

NHM ఉద్యోగుల వేతనాల కోత అన్యాయం: కల్వకుంట్ల కవిత

News Image
TG : ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వేతనాల తగ్గింపుపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఉద్యోగుల జేఏసీ నేతలతో కలిసి ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొందరి వేతనాలు రూ.4–5 వేల వరకు తగ్గించడం వివక్ష అని విమర్శించారు. ఏడు రాష్ట్రాల్లో ఉద్యోగులను క్రమబద్ధీకరించారని, తెలంగాణలోనూ వేతనాలు పెంచి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
🏠 Home