HNK : సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు ఆటపాటలతో జరుపుకునే ఈ పండుగ రాష్ట్ర ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెబుతుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సద్దుల బతుకమ్మ వేడుకలను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.