వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన మాజీ రెండో వార్డు కౌన్సిలర్ తోటకూరి రాజమణి సద్దుల బతుకమ్మ సందర్భంగా తులసి కోట బతుకమ్మ ప్రత్యేకంగా బతుకమ్మను తయారు చేశారు. సంప్రదాయానికి ప్రతీకగా తులసి కోట బతుకమ్మ రూపొందించిన ఈ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, ఆచారాల పట్ల తనకున్న అభిమానాన్ని రాజమణి ఈ వినూత్న అలంకరణ ద్వారా చాటుకున్నారు.