🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 18 October 2026, 3:42 pm Posted by : Hanumkonda

రంగలీలా మైదానాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు

News Image
వర్ధన్నపేట : వర్ధన్నపేట మున్సిపల్‌ కేంద్రంలోని రంగలీలా మైదానంలో నేడు నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లను బీఆర్ఎస్‌ నాయకులు పరిశీలించారు. బతుకమ్మ ఆడుకునే స్థలం, వేదిక, బతుకమ్మ విగ్రహం, నిమజ్జన స్థలాన్ని పరిశీలించి మున్సిపల్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏర్పాట్ల పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుజ్జ వీర రాఘవరావు, సిలివేరు కుమారస్వామి యాదవ్‌, తిరుపతి సురేష్‌, సింగరబోయిన రమ రాజశేఖర్‌, బానోత్ జ్యోతి నవీన్‌, తుమ్మల అరుణ శ్రీధర్‌, పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్‌, మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
🏠 Home