జఫర్గడ్; మండలంలోని గ్రామాలలో ఉన్న గుడులు, మజీద్ లకు సంబంధించిన భూములకు హద్దులు ఏర్పాటు చేసి వాటిని అన్యాక్రాంతం కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలి అని తహసిల్దార్ కార్యాలయంలోని అధికారికి బిజెపి మండల కమిటి తరుపున వినతి పత్రం అందజేయడం జరిగింది అని మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చాజిల్లా అధ్యక్షుడు మహ్మద్ వలిపాష జిల్లా కార్యవర్గ సభ్యులు సింగరాపు రమేష్ ,ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు మారపల్లి రవి, ధార్మిక సెల్ జిల్లా కో కన్వీనర్ ఎదులపురం మదన్ మోహన్, గీత సెల్ జిల్లా కన్వీనర్ మెరుగు రామరాజు గౌడ్, మహిళ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కు స్వప్న,మాజీ మండల అధ్యక్షుడు తౌటి సురేష్ గౌడ్, హిమ్మత్ నగర్ వార్డ్ సభ్యులు మండల ఉపాధ్యక్షుడు తాటికాయల సుభాష్ చంద్రబోస్, మండల ప్రధాన కార్యదర్శి అన్నేపు రమేష్, మన్ కి బాత్ మండల కన్వీనర్ గిరగొని యాదగిరి గౌడ్, మీడియా కన్వీనర్ సిరికొండ అక్షయ్, ఓ బి సి మోర్చా మండల కన్వీనర్ పందిబోయినా యాదగిరి, బీజేవైఎం మాజీ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి సురేష్ గౌడ్, మండల నాయకులు వాసం రవి నిరటి ,లక్ష్మణ్ బూత్ అధ్యక్షుడు చవనబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు