🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 17 October 2026, 7:24 pm Posted by : Telangana Gontuka

కీసర ఇన్‌స్పెక్టర్‌పై ఏసీబీ డీఏ కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు

News Image
TG : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కీసర పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన నివాసం, కార్యాలయంతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, అధికారికంగా రూ.2,28,50,000 విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. సోదాల్లో రూ.7 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలు, ప్లాట్లు, ఇళ్లు, వ్యవసాయ భూములు, మారుతి బ్రెజ్జా కారు, రూ.10 లక్షల విలువైన గృహోపకరణాలు గుర్తించారు. గతంలో రూ.5 లక్షల లంచం తీసుకుంటూ అరెస్టైన ఇన్‌స్పెక్టర్‌ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తాజా కేసులో కోర్టు ముందు హాజరుపరిచేందుకు ఏసీబీ చర్యలు చేపట్టింది.
🏠 Home