HNK : వర్ధన్నపేటలో నిర్వహించిన శ్రీ దుర్గాభవాని పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ శిబారాణి రాజేందర్, పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్, కౌన్సిలర్లు పాపారావు, నాయకులు సుధీర్, సురేష్, రామచందర్రెడ్డి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.