🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 17 October 2026, 3:57 pm Posted by : Telangana Gontuka

నూడుల్స్‌ తిన్న తర్వాత ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి?

News Image
ఉత్తరప్రదేశ్‌లోని నగ్లా శ్రీ పదమ్‌ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంట్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మహేశ్‌ (37), ఆయన భార్య లలిత (35), 11, 7, 3 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు మృతిచెందారు. ఘటనకు ముందు రోజు రాత్రి కుటుంబ సభ్యులు నూడుల్స్‌ తిన్నట్లు బంధువులు తెలిపినట్లు సమాచారం. ఆహార విషబాధ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ, మరణాలకు కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఫోరెన్సిక్‌ బృందాలు, ఆహార భద్రత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలు రావాల్సి ఉంది.
🏠 Home