🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 17 October 2026, 3:45 pm Posted by : Telangana Gontuka

హైవేపై నిలిచిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు.. ఆరు గంటల పాటు ప్రయాణికుల అవస్థలు

News Image
TG : ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై లోకాయతండా సమీపంలో హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి వెళ్తున్న నవయుగ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు మరమ్మతులకు గురై రహదారి పక్కన నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు సుమారు ఆరు గంటల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైవర్లు, యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎస్‌ఐ జోక్యంతో ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపించినట్లు తెలిసింది.
🏠 Home