TG : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల వినయ్ మెదడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి, బాలుడికి మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. వినయ్ తల్లిదండ్రులు ఆదినారాయణ, అనితలకు ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో ఆందోళన చెందవద్దని, బాలుడి చికిత్సకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. వినయ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.